బాహుబలి-2 షూటింగ్ పై వివాదం

February 04, 2016 | 04:58 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Animal rights activists seek action against Baahubali team niharonline

రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి-2 షూటింగ్ పై వివాదం చెలరేగింది. తాజాగా కేరళలోని త్రిసూర్ లో 'బాహుబలి 2' షూటింగ్ జరిగింది. ఈ షూటింగులో ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ ఏనుగుపై కూడా కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు సమాచారం. దాంతో ఈ చిత్ర బృందంపై జంతు హక్కుల పరిరక్షకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా దర్శకుడు, నిర్మాతలను అరెస్టు చేయాలని 'యానిమల్ టాస్క్ ఫోర్స్' బృందం డిమాండ్ చేసింది.

                        భారత వన్యమృగ బోర్డు (పీసీఏ-1960 అనుసరించి) నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సినిమాలో ఏనుగును షూటింగు కోసం ఉపయోగించారని వారు ఆరోపిస్తున్నారు. షూటింగు జరుగుతున్నంతసేపు యూనిట్ సభ్యుల అరుపులు, కేకల వల్ల ఏనుగు ఇబ్బంది పడిందని టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకే వెంకటాచలం వెల్లడించారు. అంతేకాదు నిషేధిత ఆయుధంతో ఏనుగును కుళ్లబొడిచారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో వన్యమృగాల చట్టం-2001లోని నియమాలను వారు ఉల్లంఘించారని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా దర్శక, నిర్మాతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులను ఆదేశించాలని ప్రధాని కార్యాలయాన్ని కోరినట్లు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ