ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజకు వివాహం కుదిరినట్టు సమాచారం. 2007లో శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుని, బిడ్డకు తల్లయిన శ్రీజ, ఆపై విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఆమె పెళ్లి గురించి, బీజేపీ నేత అయిన శిరీష్ భరద్వాజ్ మోదీ ని కలవటం తదితర విషయాలతో వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి వార్త నిజమా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.
కాగా, శిరీష్ భరద్వాజ్ తో విడిపోయాక, శ్రీజ లండన్ లోని కోవెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. వీరికి 2014లో విడాకులు లభించాయి. ఆపై ఆమెకు మరో పెళ్లి చేయాలని చాలా రోజులుగా చిరు కుటుంబం భావిస్తోందని, . ఇప్పుడామె వివాహం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ కుటుంబంలోని యువకుడితో నిశ్చయం అయిందని ఓ ప్రముఖ వార్తా పత్రిక కథనం వెలువరించింది. అంతేకాదు కొద్ది రోజుల క్రితమే వివాహం ఖరారైందని, మార్చిలో వివాహమని ఆ కథనం పేర్కొంది. కాగా, చివర్లో ఆ కథనం పెద్ద బాంబునే పేల్చటం విశేషం. ఈ వివాహ చర్చల కోసమే పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ నుంచి అర్థంతరంగ వచ్చాడే తప్ప కాపు గర్జన, తుని విధ్వంసంపై మాట్లాడేందుకు కాదని వెల్లడించడం గమనార్హం.