సినిమా వాళ్ళ గురించి గాలి వార్తలు బాగా వచ్చేస్తుంటాయి పేపర్లలో, ఛానళ్ళలో, వెబ్ సైట్లలో. ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకునే ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఎవరి ఫాన్ బలం ఎంత? అనేది కూడా తెలిసిపోతోంది. ట్విట్టర్ లో యాక్టివ్ గా కనిపించే దర్శకుడు రాజమౌళి సోషల్ నెట్ వర్క్ ఫాలోవర్స్ మిలియన్ దాటేసింది. అలాగే ప్రతి తారా ఇప్పుడు అభిమానులతో డైరెక్ట్ గా తన పర్సనల్స్, సినిమా వార్తలు షేర్ చేస్తున్నారు. ఇందుకు తానేం తీసిపోలేదంటూ తను కూడా అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది అంజలి. తనపై వస్తున్న రకరకాల గాసిప్స్ గురించి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేందుకు సోషల్ నెట్వర్క్ సైట్లలో అడుగుపెట్టేసింది. అలాగే తన సినిమాలు, ఈవెంట్ల గురించి ఫ్యాన్స్ తో పంచుకోవడానికి ట్విట్టర్‌ను వేదికగా చేసుకుంది. ఈ విషయాన్ని తనే తెలిపింది. ‘హే... స్టార్ట్స్ ట్వీటింగ్’ అంటూ తొలి ట్వీట్ చేసింది అంజలి. అంతేకాదు తన క్లోజ్ ఫ్రెండ్ నీరజతో దిగిన ఫోటోని పోస్టు చేసింది. ఇటీవల ఓ పబ్బులో ఈమె తాగి, నానా హంగామా చేసిందంటూ వార్తలు వచ్చేసాయి. తను క్లారిటీ ఇచ్చుకునేందుకు సోషల్ నెట్వర్క్ ఎక్కౌంట్ లేదు పాపం తనకి. అందుకే వెంటనే అక్కౌంట్ ఓపెన్ చేసినట్టుంది అంజలి పాప.