ఆక్సిజన్ కోసం హాట్ బాంబ్

February 03, 2016 | 03:54 PM | 3 Views
ప్రింట్ కామెంట్
anu-emmanuel-gopichand-oxygen

టాలీవుడ్ పై మళయాళీ ముద్దుగుమ్మల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. నయనతార మొదలు అమలాపాల్, నిత్యామీనన్, మాళవిక నాయర్, ఇలా ఈ లిస్ట్ లోకి మరో భామ వచ్చి చేరింది. మల్లూవుడ్ లో మొదటి చిత్రంలో నటిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ త్వరలో తెలుగులో నటించబోతుంది.  నటుడు నివీన్ పౌలీ తర్వాతి చిత్రంతోనే అక్కడ ఆరంగ్రేటం చేస్తున్న ఈ భామ ఓ తెలుగు చిత్రం కోసం ఎంపికైనట్లు సమాచారం.

అమెరికా నుంచి వచ్చిన అను ఇమ్మాన్యుయేల్ స్తతహాగా మళయాళీనే.  త్వరలో గోపీచంద్ హీరోగా నటించబోతున్న ఆక్సిజన్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది.

'మేము ఆక్సిజన్ కోసం కొత్త హీరోయిన్ ని అన్వేషిస్తున్నాం. ఈ రోల్ కి అను కరెక్ట్ ఆప్షన్ అనుకున్నాం. ఆక్సిజన్ ఒక యాక్షన్ థ్రిల్లర్ అని ఇందులో బోల్డ్ గా ఉండే పెర్ఫామెన్స్ బేస్డ్ రోల్ చేయాల్సి ఉంటుందని చెప్పామంతే' అంటూ చెప్పాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ.

మరికొన్ని రోజుల్లోనే అను ఆక్సిజన్ షూటింగ్ లో పాల్గొననుంది. ఈ మూవీలో రాశిఖన్నా లీడ్ హీరోయిన్ కాగా సీనియర్లు జగపతిబాబు - సితార కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ