కోట్లకు కోట్లు రెమ్యునరేషన్, ఇంద్రభవంతిని తలపించే బంగ్లా, కోట్లలో లాభాన్ని తెచ్చిపెట్టే క్రికెట్ జట్టు వీటన్నింటికి ఆయన ఓనర్, అన్నింటికి మించి బాలీవుడ్ ని ఏలుతున్న బాద్ షా షారుక్ ఖాన్. ఇంత ఉన్న తనకు కూడా తీరని కోరికలు ఉన్నాయని చెబుతున్నాడు షారూఖ్. ఆశ్చర్యపోకండి... నిజమే షారుక్ కి తీరని కోరికలున్నాయంట.
తనకు చిన్నప్పటి నుంచి ఓ తీరని కోరిక ఉందట. అదే ఓ ప్రైవేట్ విమానం కొనటం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఓ లైవ్ ప్రోగామ్ లో వెల్లడించారు. చాలా కాలంగా విమానం కొనుక్కోవాలని అనుకుంటున్నానని, అయితే దానికి సరిపడా డబ్బు తన దగ్గర లేదని ఆయన తెలిపారు. డబ్బంతా సినిమాల్లోనే పెడుతున్నానని, సరిపడా డబ్బుంటే ఎప్పటికైనా విమానాన్ని కొని తన కోరికను తీర్చుకుంటానని అన్నారు.
నా ముందు ఉన్నవి రెండే రెండు. ఒకటి సినిమాలు చేయటం లేదా విమానం కొనటం. ప్రస్తుతానికైతే సినిమా చేసుకుంటూ పోతున్నా... త్వరలో అయిన విమానం కొనాలనే నా కొరిక నెరవేరాలని అనుకుంటున్నా అని చెప్పాడీ 50 ఏళ్ల టాప్ హీరో. కాగా, పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే షారుక్ దగ్గర డబ్బులేకపోవడమేంటని సినీ వర్గాలు విస్మయపోతున్నాయి.