అనుష్క ప్రేమలో పడిందా?

May 04, 2015 | 02:38 PM | 152 Views
ప్రింట్ కామెంట్
anushka_shetty_vedio_leaked_niharonline

సౌత్ సినిమాలో దాదాపు పదేళ్ళుగా తన నటనతో అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనుష్క ఇక పెళ్ళికి సిద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్నా మళ్ళీ సినిమాలు చేయడానికి ఒప్పుకుంటూనే ఉంది. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఆమె పెళ్ళి ముచ్చట వార్తల్లోకి ఎక్కింది. ఆమె త్వరలో పెళ్ళి చేసుకోనుందనీ, ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారనే ప్రచారంతో పాటు ఈమెకు ఓ బాయ్ ఫ్రెండు కూడా ఉన్నాడనీ, అతనితో చాలా సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తూ సంచలనం రేపుతోంది. అయితే ఈమె ఇప్పుడు స్పందించింది. ‘ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమైనా చేసుకోవచ్చు... లేదా ప్రేమించిన వ్యక్తినైనా చేసుకోవచ్చు’ నంటోంది. అంటే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు ఒప్పేసుకుంది. అనుష్క ప్రేమలో పడిందన్న వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకూ అనుష్క ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలియలేదు. ఇప్పుడు అనుష్క నటించిన బాహుబలి, రుద్రమదేవి సినిమాలు విడుదలవాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ