తమిళ నటుడు కార్తీ కొంబాన్ సినిమా తరువాత రెడీ అవుతున్న రెండు చిత్రాల్లో ఒకటి తెలుగులో మల్టీ స్టారర్ డైరెక్ట్ మూవీ కాగా, మరో సినిమా కాశ్మోరా. అయితే ఈ సినిమా మొదలవుతుండడంతో ముంబాయిలో 24 సినిమా షూటింగ్ లో ఉన్న సూర్య హుటాహుటిన తమ్ముడి కోసం చెన్నైలో దిగిపోయాడట. కార్తీ అన్నగారి సలహాలేనిదే ఏ పనీచేయడట. కార్తీ ఆయనకు తెలియకుండా ఏ చిన్న పనీ చేయకపోవడం వారి అన్న దమ్ముల అనుబంధానికి నిదర్శనం. కోలీవుడ్ లో ఈ అన్న దమ్ముల గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. కారణం ఈ ఇరువురి మధ్య సోదర ప్రేమ అపారంగా కనిపించడమే, సినిమా వాళ్ళు ఎవరైనా సూర్యను సినిమా చేయమని అడగడానికి వస్తే, ఈ కథ తమ్ముడికి బాగా సూటవుతుందని చెపుతాడట, ఇలా తనకు వచ్చిన ఛాన్సులను తమ్ముడికి ఇప్పిస్తూ తన ప్రేమను చాటుకుంటాడట సూర్య. అలాగే అన్న సలహాతో ఏ పని చేసినా కలిసొస్తుందని కార్తీ కూడా నమ్ముతుంటాడట. అయితే ఇప్పుడు తమ్ముడు కార్తీ చేస్తున్న కాశ్మోరా మూవీకి గోకుల్ దర్శకత్వం వహిస్తున్నాడు.