హమ్మయ్యా... ఇన్నాళ్లకు అఫైర్ ను ఒప్పేసుకుంది

February 18, 2015 | 12:10 PM | 22 Views
ప్రింట్ కామెంట్
virat_kohli_anushka_sharma_affair_confirmed_niharonline

ఓ వైపు క్రికెట్ రంగం, మరో వైపు బాలీవుడ్ రెండూ ఇంట్రస్టింగ్ గా ముచ్చటించుకున్న జంట విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ. వీరిద్దరు గతకొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏకాంతంగా బయట ఎన్నిసార్లు రెడ్ హ్యండెడ్ గా దొరికినప్పటికీ దాని గురించి ఇద్దరిలో ఏ ఒక్కరు పెదవి విప్పలేదు. కానీ ఒకనోక సమయంలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని, అందుకే బీసీసీఐ పర్యటనలకు అనుష్కను అనుమతించిందని కోహ్లీ చెప్పాడు. అఫ్ కోర్స్ ఈ విషయం పై అనుష్క ఫైరయ్యిందనుకోండి అదే వేరే విషయం. తన అనుమతి లేకుండా మీడియాతో ఎవరు ఈ విషయాన్ని చెప్పామన్నారంటూ కోహ్లీ పై మండిపడిందట. అంతేకాదు ఆమె మేనేజర్ ఒకరు ఈ విషయాన్ని కొట్టిపడేశాడు కూడా. దీంతో వాళ్ల మధ్య అంత స్ట్రాంగ్ రిలేషన్ లేదని కాస్త కన్ఫమ్ అయ్యింది. అయితే తాజగా ఎట్టకేలకు ఈ విషయంపై అనుష్క నోరు తెరచింది. తాను విరాట్ తో ప్రేమలో వున్నానని, అతనితో తన పెళ్లి గురించి త్వరలోనే తెలియజేస్తానని ఓ మీడియా చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిందట. తన సినీ కెరీర్ దెబ్బతింటుందన్న ఆలోచనతోనే ఇంతకాలం ఈ విషయంపై మాట్లాడలేదని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. మరి ఫ్యూచర్ లో ఈ వార్తను కూడా ఉత్తదేఅని ఈ బ్యూటీ కొట్టిపాడేయదు కదా . ఇంతకీ వీళ్ల ప్రేమ పెళ్లి పీటలు ఎక్కుతుందా? డౌటే... అది కాలమే నిర్ణయించాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ