తనయునితో సిటీ అంతా తిరిగెయ్యాలనుందట...!

October 08, 2015 | 12:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
allu-arjun-father-feelings-niharonline

అల్లు అర్జున్ పుత్రోత్సాహం సోషల్ మీడియాలో బాగానే కనిపిస్తుంటుంది. అయినా ఇంకా తన సుపుత్రుని విషయంలో... తనను చాలా మిస్ చేస్తున్నట్టు ఫీలవుతున్నాడు అర్జున్. కారణం పెద్ద హీరో కాబట్టి బయట మామూలు మనిషిగా తిరగలేకపోతున్నాడట అది కూడా తన కొడుకుతో... తనయుడు అల్లు అయాన్ ని బైక్ పై కూర్చోబెట్టుకొని రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకెళ్ళాలని చాలా కోరికగా ఉంటుందట...  కానీ అలా చేయడానికి ఈ హీరోగారికి కుదరదు కదా... అల్లు అర్జున్ బయట ఎక్కడ కనిపించినా జనాలు చుట్టు ముట్టేస్తారాయె... ఎంతయినా చాలా మంది హీరోలు ఫ్రీ బర్డ్స్ లా ఎక్కడంటే అక్కడ తిరగలేరు విదేశాలు వెళ్ళినప్పుడు తప్ప. 
ముఖ్యంగా చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు ఎత్తుకుని పార్కులూ... రోడ్లూ చూపిస్తుంటే వాళ్ళు పొందే ఆనందానికి రెట్టింపు ఆనందం తల్లి దండ్రులు పొందడం సహజం. ఆ ఛాన్స్ మిస్ అవుతున్నానని తెగ బాధ పడుతున్నాడు అర్జున్. అయితే ఈ ఇబ్బంది భార్య స్నేహకు లేదట తను అయాన్ తీసుకుని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి పోయి షాపింగ్ లు చేస్తుంది. మాల్స్ లో ఆడిస్తుందట... తనకా ఛాన్స్ లేదని  బాధ పడుతున్నాడు అర్జున్. అందుకేగా ఫామిలీతో ఎక్కువ సమయం గడపాలనుకునే మహేష్ బాబు సంవత్సరానికోసారి తప్పనిసరిగా విదేశీ టూర్ ప్లాన్ చేస్తుంటాడు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ