దర్శకుడు తేజ దృష్టి ఎందుకని మహేష్ మీద పడిపోయింది. ఇండస్ట్రీలో ఇంత మందుండగా ఆయన మహేష్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆయన ఊరిని దత్తత చేసుకునే విషయంలోనూ అవాకులు చవాకులు పేలారు. అయినా ఎవరి ఆలోచనలు వారివి... ఇతరులకు ఆయనేం నష్టం చేయడం లేదే... ఊరిని దత్తత ఎప్పుడు ఎలా తీసుకుంటే ఆయనకెందుకు? అది చాలదన్నట్టు ఎప్పుడో రిలీజైన నిజం సినిమా గురించి ఇప్పుడెందుకు? ఒక సినిమా బాగా హిట్ అయ్యిందంటే... తరువాత సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే... ఎప్పటి నిజం మాట ఇప్పుడెందుకు? ఇప్పటికే మహేష్ దత్తత తీసుకున్న గ్రామాల గురించి కామెంట్ చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి కామెంట్ చేస్తున్నాడు. ఆ చిత్రం ఘోర పరాజయాన్ని పొందింది కానీ మహేష్ బాబు కు మాత్రం ఉత్తమ నటుడి అవార్డ్ లభించింది . అయితే ఆ చిత్రం ఫెయిల్ కావడానికి మహేష్ బాబే కారణ మాట. నిజం కంటే ముందు ఒక్కడు భారీ హిట్ రావడం వల్ల మా నిజం తేలిపోయిందని అదే ఒక్కడు రాకుండా ఉంటే తప్పకుండా నిజం పెద్ద హిట్ అయ్యేదని అంటున్నాడు . ఓకే అప్పటికీ జనాలకు రీచ్ కాకపోయినా... టీవీల్లో వచ్చిన ప్రతి సారీ ఈ సినిమాను జనాలు ఇంట్రెస్టుగా చూడాలిగా... అలా జరగడం లేదు... నిజంలోని మహేష్ క్యారెక్టర్ జనాలకు కనెక్ట్ కాలేదు. కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా బుల్లి తెరమీద వచ్చినప్పుడు మాత్రం ఎన్నిసార్లయినా చూసేస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఖలేజా ఒకటి. కాబట్టి తేజ తన ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించడం, తనను తాను సమర్థించుకోవడం మానేసి... సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలో కాస్త క్రియేటివిటీగా ఆలోచిస్తే బెటరేమో!