మొన్న అన్నపూర్ణ ఈ రోజు ఆశ... అలీపై ఫైర్...

November 03, 2015 | 04:14 PM | 2 Views
ప్రింట్ కామెంట్
asha-fire-with-ali-niharonline

ఏదో నవ్వుకోడానికి మాట్లాడేస్తుంటాడులే... ఇంత మాత్రానికే అంతలా తిట్టాలా అన్నపూర్ణ ఓ పెద్దాయిన్ని పట్టుకుని అనుకున్నారు అన్నపూర్ణ సుంకర విడుదల చేసిన వీడియో చూసి... కానీ... అలీ మరీ రెచ్చిపోయి మాట్లాడారు సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ లో... ఆలీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. 'అనుష్క తొడలు' అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై మండిపడుతూ హైదరాబాద్ కు చెందిన ఆశ అనే ఓ యువతి ఫైరయింది. పాపం అనుష్క కూడా ఇది విని షాకైంది. ఇలా మహిళలను అవమానపరిస్తే మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామంటూ ఓ వీడియో చేసి నెట్ లో వదిలింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. టీవీ ప్రొగ్రామ్స్ ల్లో, సినిమా ఫంక్షన్లలో ఆడవాళ్లపై ఆలీ వల్గర్ కామెంట్స్ చేస్తున్నాడని, ఇటీవల మరింత దిగజారుడు కామెంట్స్ చేస్తున్నాడని ఆ యువతి ఆలీపై మండిపడింది. ఆలీ చేస్తున్న ప్రొగ్రామ్స్ నేరుగా టీవీల్లోనే వస్తుండటంతో ఇంట్లో ఉండే పిల్లలు, తల్లిదండ్రులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ సంఘాలతో ఆలీ అంతు చూస్తామని ఆ యువతి హెచ్చరించింది.ఇటీవల అన్నపూర్ణ సుంకర అనే యువతి కూడా ఆలీపై మండిపడిన విషయం తెలిసిందే. 'ఆలీ మనిషా..దున్నపోతా..' అంటూ ఘాటు పదజాలం వాడిన సంగతి తెలిసిందే. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ