ఇప్పుడు జబర్దస్త్ పుణ్యమా అని ఎందరో కమెడియన్స్ వచ్చేస్తున్నారు. ఓ పక్క అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమాలో ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి, తాగుబోతు రవి మరికొందరు యంగ్ కమెడియన్స్ తెరమీద బాగా నవ్వులు పూయిస్తున్నారు. ఇక సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం బ్రూస్ లీలో చేసిన కోతి చేష్టలు పెద్దగా ఎవరికీ నచ్చనట్టుంది. పైగా ప్రతి సినిమాలోనూ వెర్రిపప్పను చేసి చెంపదెబ్బలు కొట్టేస్తున్నారు. ఈ తరహా కామెడీని ఇక రిపీవ్ చేసుకోలేక పోతున్నారు ఆడియన్స్ ఈ దశలో ఆయనకు ఇక రిటైర్మెంట్ ఇచ్చినట్టే నని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం తమ సినిమాలో ఒక్క సీన్ లో నటించినా చాలు సినిమా హిట్ అని బ్రహ్మి వెంట పడుతుండేవాళ్ళు దర్శక నిర్మాతలు . ఇప్పుడు ఇండస్ట్రీలో బ్రహ్మి పై బోలెడు ఆరోపణలు వస్తున్నాయి పలువురు నటీనటులను ఎదగకుండా చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తోడూ బ్రహ్మి రెమ్యునరేషన్ కూడా ఎక్కువ కావడంతో ఇతర కమేడియన్ల పై ఆధారపడుతున్నారు దర్శక నిర్మాతలు దాంతో బ్రహ్మి పని అయిపోయినట్లేనని అంటున్నారు .