ఆసిన్ పెళ్ళికూతురవుతోంది...

August 10, 2015 | 02:10 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Asin_and_rahul_sharma_niharonline

ఇటు దక్షిణాది సినీ అభిమానులకూ బాలీవుడ్ ప్రేక్షకులకూ తెలిసిన నటి ఆసిన్. గజినీ సినిమా ద్వారా దాదాపు ఇండియా మొత్తం తెలిసిన తార ఈమె. 29 ఏళ్ళ ఆసిన్ ఇప్పుడు పెళ్ళి పీటలెక్కడానికి సిద్ధమై పోయింది. ఈమె ప్రముఖ బిజినెస్ మెన్ రాహుల్ శర్మను పెళ్ళి చేసుకోబోతోంది. ఈయన మైక్రో మాక్స్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఇప్పుడు ఆసిన్ నటిస్తున్న ఆల్ ఈజ్ వెల్ చిత్రం పూర్తి కావస్తుండడంతో తన పెళ్ళి విషయం బయట పెట్టినట్టు తెలుస్తోంది.  ఈ జంట తమ పెళ్ళి డేట్ ను త్వరలో తెలియజేయనున్నారు.  ఇప్పటికే  ఆసిన్ రెండు సంవత్సరాలుగా ఎలాంటి సినిమా కమిట్ మెంట్స్ కు ఒప్పుకోవడం లేదనీ, తన పర్సనల్ లైఫ్ కు సమయం ఇవ్వలేకపోవడం వల్ల ఇలా ఏ సినిమాలకు ఒప్పుకోవడం లేదని తెలిపింది.  ఇక ఈమె ఆల్ ఈజ్ వెల్ సినిమాతో తన సినీ జీవితానికి ముగింపు పలుకుతుందా? అని  అభిమానులు అనుకుంటున్నారు.  ఈ విషయాన్ని ఆమె ఇంకా కన్ఫం చేయలేదు.  
ఆసిన్ మళయాళంలో ఎంట్రీ ఇచ్చినా, తెలుగులో మాత్రం అమ్మా నాన్న ఓ తెలుగమ్మాయిలో  రవితేజ సరసన మొదట హీరోయిన్ గా నటించింది.  బాలీవుడ్ లో మొదటి  ఎంట్రీ ఇచ్చింది అమీర్ ఖాన్ గజినీ (2008)తోనే.  ఆసిన్ 38 ఏళ్ళ రాహుల్ శర్మతో గత రెండు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.  మొదటి సారిగా ఈ ఇరువురూ 2013లో ఆసిన్ బర్త్ డే రోజున అందరి దృష్టిలో పడ్డారు.  రాహుల్ శర్మకు ఇండియాలోనే అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా పేరుంది. ఈయన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ కు తనయుడు. తన స్వయం కృషితో ఎదిగిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. నాగ్ పూర్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్ ఫోన్ విక్రయ కంపెనీకి సీఇఓ గా పనిచేస్తున్నాడు. అయితే ఆసిన్ గజినీ సినిమాలో ఓ బిజినెస్ మేన్ దృష్టిలో పడ్డట్టు రియల్ లైఫ్ లో కూడా ఒక యంగ్ బిజినెస్ మేన్ ను బుట్టలో వేసిందన్న మాట.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ