అట్లూరి రామారావు ఇక లేరు

February 06, 2015 | 01:00 PM | 29 Views
ప్రింట్ కామెంట్

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సినీ నిర్మాత అట్లూరి రామారావు (90) శుక్రవారం ఉదయం పంజాగుట్టలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. రామారావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ఆయన ఆ సంస్థ ద్వారా వచ్చిన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు శనివారం ఉదయం ఎర్రగడ్డ స్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు, 'ఈనాడు' ఎండీ కిరణ్‌ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఇంకా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు అట్లూరి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఇంకా సినీ పరిశ్రమకు చెందిన పలువురు పంజాగుట్ట హిందీనగర్లోని ఆయన నివాసానికి చేరుకుని రామారావు భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ