ప్ఛ్... సొగసరి సింగర్ పెళ్లిచేసేసుకుంది

February 06, 2015 | 12:55 PM | 24 Views
ప్రింట్ కామెంట్

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ వివాహం చేసుకుంది. 30 ఏళ్ల శ్రేయా తన చిన్నప్పటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన షీలాదిత్యను బెంగాలీ సాంప్రదాయంలో గురువారం రాత్రే వివాహం చేసుకుందట. ఈ విషయాన్ని శ్రేయ స్వయంగా తన ట్విట్టర్ లో పేర్కొంది. ‘‘నా జీవితంలో నేను ప్రేమిస్తున్న వ్యక్తిని నిన్న రాత్రి(గురువారం) సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నా. ఈ వేడుకకు మా ఇరు కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. మాజీవితంలో నూతన దశను ప్రారంభించబోతుండటంపై ఆత్రుతతో ఉన్నాం. నాభర్త షీలాదిత్య, నేను మీ నుంచి గుడ్ విషెష్ కోరుకుంటున్నాం’’ అని ట్వీట్ చేసింది. సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం ద్వారా సింగర్ గా శ్రేయా కెరీర్ ను ప్రారంభించింది. బాలీవుడ్, తెలుగుతోపాటు మొత్తం 8 భాషల్లోని చిత్రాలకు శ్రేయా తన స్వరాన్ని అందించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ