ఎర్రబస్సు సినిమా ఫలితం ఎలా ఉన్న అందులో బ్రహ్మీ ఉన్నాడన్న కారణంతో థియేటర్లకు వెళ్లిన వారు బయటికొచ్చేప్పుడు ఛీ కొడుతూ వస్తున్నారు. బ్రహ్మీ లాంటి స్టార్ కమెడియన్ ను దర్శకరత్న దాసరి సరిగ్గా వాడుకోలేదనే చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాలో కాకితో చేసిన కామెడీ ప్రేక్షకులకు నవ్వుతెప్పించకపోగా, చిరాకు పుట్టించిందట. ఇక ఈ విసుగుపుట్టిచే కామెడి ట్రాక్ లో బ్రహ్మీ ఫెర్ఫార్మెన్స్ కూడా బాలేదని చెప్పేశారు. ఈ మధ్య వచ్చే చిత్రాలు కథ ఎంత చెత్తగా ఉన్న అందులో బ్రహ్మీ కామెడీ గనుక పండిందంటే చిత్రం ఖచ్చితంగా హిట్టవుతుంది. మరి ఈ ప్రాథమిక సూత్రాన్ని దాసరి చెవికెక్కిచ్చుకోచ్చుకోని కామెడీ ట్రాక్ పై బాగా శ్రద్ధ పెట్టి ఉంటే గనుక చిత్రం కనీసం యావరేజ్ గా నిలిచేదని ప్రేక్షకులు అంటున్నారు. అయినా ఎంత నటులైనప్పటికీ చిత్రంలో మంచి కార్యెక్టర్ లేకపోతే ప్రజల నుంచి మెప్పు పొందాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది .