మంచి వాళ్ళెప్పుడూ మేం మంచి వాళ్ళం... అని చెప్పుకోరు... చెడ్డ వాళ్ళెప్పుడూ మేం చెడ్డ వాళ్ళం అని కూడా చెప్పుకోరు... ఇప్పుడు ఓపెన్ హార్టెడ్ మనుషులు చాలా తక్కువ. లోపల ఒకటుంటే... పైకి ఒకటి మాట్లాడుతుంటారు... కానీ కొందరి మనసేమిటో ఒక్కొక్కరు ఒక్క రోజులో అర్థమవుతే... కొందరు ఒక్క గంటలో కూడా అర్థమవుతారు. మరి కొందరు సీరియస్ సందర్భం ఏదైనా ఎదుర్కొన్నప్పుడు కానీ వారి మనసు బయట పడదు (వీరికి లౌక్యం పాళ్ళు ఎక్కువ. బేసికల్లీ చాలా తెలివైన వారన్నట్టు)... ఫలానా వారు మంచా, చెడా అనేది ఇతరులు చెప్పాలి కానీ... వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటే కాదు కదా... సరే ఇప్పుడు ఓ హీరోయిన్ నేను చాలా బ్యాడ్ అంటోంది. పైగా నేను తెరమీద కనిపించినంత సాఫ్ట్ కాదు అంటోంది బాలికా వధు (అవికాగోర్). ఈ అమ్మడు ఓ సీరియల్ తో దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందింది. తెలుగులో నటించిన ఉయ్యాలా జంపాల, లక్ష్మీ రావే మా ఇంటికి చిత్రాలు హిట్ కావడంతో తాజాగా ‘సినిమా చూపిస్త మావ’ చిత్రంలో నటించింది. అయితే ఈ అమ్మాయి రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ ని పెళ్ళాడాలని అనుకుందట కారణం ఆమెను ''రాంజానే '' చిత్రంతో పడగొట్టాడట. ధనుష్ నటనకు ఆయనపై మనసు పారేసుకుందట అవిక. ధనుష్ కు పెళ్ళయ్యిందనీ... అతను రజనీకాంత్ అల్లుడని ఆ తరువాత తెలియడంతో వెనకడుగు వేసిందట. ప్ఛ్ ధనుష్ కు ప్రపోజ్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది అవి గోర్.