రాజ్ కుమార్ హిరానీకి యాక్సిడెంట్

August 11, 2015 | 05:37 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Rajkumar_hirani_niharonline

భారత నెంబర్ వన్ దర్శకుడిగా కీర్తి పొందిన రాజ్ కుమార్ హిరాని మంగళవారం బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. మున్నాభాయ్ ఎంబీబిఎస్, లగేరహో మున్నాభాయ్,  త్రీ ఇడియట్స్,  పీకే లాంటి బ్లాక్ బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించిన ఈ స్టార్ డైరెక్టర్ ముంబయిలో బైకుపై వెళుతుండగా అదుపుతప్పి పడిపోయారు. పెద్ద ప్రమాదం లేకపోయినా తగిలిన గాయాలు మాత్రం పెద్దవేనని డాక్టర్లు చెపుతున్నారట. ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో ఐసీయూలో హిరానీకి చికిత్స చేస్తున్నారు. అతను బైక్ మీద వెళ్ళడం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. అసలు విషయం ఏమిటంటే... హిరాని దగ్గర పని చేసే ఉద్యోగి ఒకరు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొన్నారట. దాన్ని చూసి ముచ్చటపడిన హిరానీ, కొద్ది సేపు రైడ్ చేద్దామనుకున్నారో ఏమో... అది అదుపు తప్పి ప్రమాదం అంచులకు వెళ్ళాడు. భారీగా ఉండే ఈ ఎన్ఫీల్డ్ నడపాలంటే మనిషి బలంగా ఉండాలట. ఆయనది భారీ ఖాయం కాకపోవడం...  బండిని స్లోగానే నడిపినా, దాన్ని అదుపు చేయలేక పోయారు. రోడ్డు మీద పడటం.. తన మీద బైక్ పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి హిరానిని పరామర్శించారు. ఆయన ఇప్పుడు హీరో సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ