తన సొంత చిత్రంలా బిల్డప్ ఇస్తున్నాడేంటి?

June 02, 2015 | 03:16 PM | 3 Views
ప్రింట్ కామెంట్
bahubali_hindi_advertise_with_karan_niharonline

బాహుబలి హిందీ హక్కలును సొంతం చేసుకున్న కరణ్ జోహార్... తన సొంత చిత్రమైపోయినంత బిల్డప్ ఇచ్చేస్తున్నాడని మన తెలుగు సినీ పరిశ్రమలో ఓ చర్చ నడుస్తోంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు రాజమౌళి దాదాపు మూడు సంవత్సరాల కష్టం ఆయనది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై రాజమౌళి నిర్ణయం తీసుకోకుండానే... విడుదల తేదీ ప్రకటించేస్తున్నాడు కరణ్ జోహార్. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనే దానిపై తనకి ఐడియా లేదని, ఫలానా డేట్‌ చెప్పడం కంటే అన్ని పనులు పూర్తయిన తర్వాతే రిలీజ్‌ డేట్‌ గురించి డిసైడ్‌ చేయాలని రాజమౌళి అంటుంటే.... ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్‌ చేయబోతున్న కరణ్‌ జోహార్‌ హడావుడి ఎక్కువైపోయింది. ఆయన రాజమౌళి ఏమీ డిసైడ్ చేయకుండానే బాహుబలి జులై పదికి వస్తుందని కరణ్‌ పదే పదే చెబుతున్నాడు. ఇప్పుడు హిందీ వర్షన్ కు ప్రకటనకూడా ఇచ్చేస్తున్నాడు. దీనిపై ఇండస్ట్రీలో అంతా విపరీతమైన చర్చ జరుగుతోంది. రాజమౌళి ఏమనుకుంటున్నాడో గానీ, కరణ్ అతి చనువు మాత్రం మన తెలుగు సినీ అభిమానులకు నచ్చడం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ