బ్రహ్మాండమైన చారిత్రక సినిమా, చక్కని తరాగణం... బాగు బాగు అనిపించిన సినిమా పోస్టర్లు.... రుద్రమదేవి జన్మ స్థలంలో ఆడియో రిలీజ్ లు.... ఇదిగో... అదిగో రిలీజవుతోందంటూ మార్చి, ఏప్రిల్ లో ఊరించి... ప్రేక్షకుల ఎదురు చూపుల్ని చప్పగా చల్లార్చింది రుద్రమదేవి సినిమా. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఏమైందో ఏమో ఈ సినిమా రిలీజ్ పై ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. అప్పట్లో బాహుబలికి పోటీ అన్నట్టు వార్తల్లోకి ఎక్కింది. నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని యూనిట్ బృందం భావించిందదట. కానీ అది కూడా కుదరలేదు. ఈ చిత్రాన్ని ఫైనాన్షియల్ సమస్యలు చుట్టుముట్టాయంటున్నారు. విడుదల అర్థంతరంగా ఆగిపోయింది.
అయితే.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఈ చిత్రాన్ని జూన్ లేదా జులైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ కంటే ముందుగా ‘రుద్రమదేవి’ని విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ చిత్రం కోసం 70 కోట్లకు పైగానే ఖర్చు చేశారట. కలెక్షన్ల కోసం బాహుబలి కంటే ముందే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇది కూడా నమ్మకం తక్కువే అనుకుంటున్నారు. కారణం ఆర్థిక ఇబ్బందులే అంటున్నారు. అనుష్క ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, నిత్యామీనన్ లు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. సక్సెస్ లేక సతమతమవుతున్న దర్శకనిర్మాత గుణశేఖర్.. తన మీదున్న ‘ఫెయిల్యూర్’ మార్క్ ను తుడిపేసుకునేందుకు ‘రుద్రమదేవీ’ చిత్రాన్ని ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ చిత్రంతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఎంతగానో భావించారు. కానీ ఇంతలోనే ఆర్థిక ఇబ్బందులు ఎదురకావడంతో అతను చాలా డీలా పడినట్టు తెలుస్తోంది. అయినా విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాడని సన్నిహితులు చెపుతున్నారు. గోనగన్నారెడ్డి, రుద్రమదేవిలను తెరమీద చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూసిన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.