తెలుగు ప్రేక్షకులే కాకుండా భారతీయ సినిమా అభిమానులంతా ఎదురు చూస్తున్న బాహుబలి చిత్రం ఇక పక్కాగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట. అయితే ఈ సినిమా ట్రైలర్ మాత్రం మే 31న విడుదల చేస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి సారధ్యంలో ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని మే 15న విడుదల చేయబోతున్నట్లుగా గతంలో దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆలస్యం జరుగుతోంది. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ... ‘బాహుబలి’ మొదటి భాగం చిత్రాన్ని మే 15న విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమే. కానీ కొన్ని గ్రాఫిక్స్ వర్క్ మరియు టెక్నికల్ వర్క్ వలన ఆలస్యం అవుతుంది. అందుకే విడుదల చేయలేకపోయాం. అయితే ఈ చిత్ర ట్రైలర్ ను మే 31వ విడుదల చేస్తున్నాం. జులైలో చిత్రాన్ని విడుదల చేస్తామని ఆయన చెప్పారు. షూటింగ్ ఇటీవలే పూర్తవడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఆడియోను కూడా జూన్ నెలలో విడుదల చేయనున్నారట.