ఓ డాక్టర్ ను కొట్టేంతటి సమస్య ఆ నిర్మాతకేంటి?

April 29, 2015 | 12:36 PM | 15 Views
ప్రింట్ కామెంట్
c_kalyan_threatning_doctor_niharonline

టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ఆయనపై ఓ డాక్టర్ తనను కొట్టాడంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఒక ఫ్లాట్ విషయంలో తనను నిర్మాత కల్యాణ్ బెదిరిస్తున్నాడని డాక్టర్ కవిత ఆమె ఫిర్యాదులో తెలిపింది. కాగా మెట్రో రైలు నష్టపరిహారం కింద  జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 5లోని 11 ఫ్లాట్స్ కు రూ.1.4 కోట్లు ఆమె చెల్లించింది.  అయితే కల్యాణ్ కూడా అదే అపార్ట్ మెంటులో నివాసం ఉంటున్నారు.  దీనికి సంబంధించి సి.కల్యాణ్ ఓ ప్రత్యేక ఖాతా తెరవటంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయం మీదే తమను బెదిరించి, దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా తనపై చేయి కూడా చేసుకున్నాడని డాక్టర్ కవిత అర్థ రాత్రి సమయంలో పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు సి. కల్యాణ్ పై 506, 509, 345c సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ