బాహుబలిపై బాంబు దాడిచేసిన తమిళ పులులు

July 22, 2015 | 05:21 PM | 6 Views
ప్రింట్ కామెంట్
bahubali_theatre_petrol_bombs_niharonline

తమిళనాడులోని ఓ బాహుబలి సినిమా నడుస్తున్న ఓ థియేటర్ పై బాంబు దాడి చేశారు.  ఈ బాంబు దాడి లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  అక్కడి పోలీసులే కాదు,.. ఇక్కడ ఈ చిత్ర యూనిట్ కూడా ఊపిరి పీల్చుకుంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినా ఈ చిత్రాన్ని నిర్మించిన తీసిన వారు కూడా ఆందోళన పడాల్సి ఉంటుంది. ఇలాంటి దేమీ లేకుండా ఈ దాడి ప్రశాంతంగా ముగిసినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. మదురై లో బాహుబలి ని ప్రదర్శిస్తున్న థియేటర్ పై తమిళ పులి సంస్థ కు చెందిన కొంతమంది యువకులు పెట్రోల్ బాంబులతో బాహుబలి థియేటర్ పై దాడి చేసారు . బాహుబలి చిత్రంలో గిరిజనులను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని ఆందోళన చేశారు. అంతే కాదు వారు తమకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ దాడికి పూనుకున్నారు . తమిళ పులి కార్యకర్తల దాడితో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గానీ, కొద్ది సమయంలోనే అంతా సద్దుమణిగేలా చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ