మన తెలుగువాళ్ళు ఇంతకుముందెన్నడూ కనీ వినీ ఎరుగని ఓ రికార్డు బాహుబలి సినిమా.
ఓ తెలుగు సినిమా ఇంతటి రికార్డు సాధిస్తుందనీ ఎవరూ ఊహించలేదు. ఓ బాలీవుడ్ టాప్ సినిమా కలెక్షన్లను ఓ టాలీవుడ్ సినిమా అక్కడ సాధించడం ఈ క్రెడిట్ అంతా ఎస్ఎస్ రాజమౌళికే దక్కుతుంది. బాహుబలి ఇప్పుడు హిందీలో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. అది కూడా ఓ తెలుగు డబ్బింగ్ సినిమా అయిన బాహుబలి హిందీలో 100 కోట్ల మార్క్ ని క్రాస్ చెయ్యడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. బాహుబలి సినిమా ఒక్క హిందీ వెర్షన్ లోనే 4వ వీకెండ్ వరకూ కలుపుకొని 103.51 కోట్లు కలెక్ట్ చేసి హిందీలో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. హిందీలో డబ్ అయ్యి రిలీజ్ అయ్యే సినిమాలే తక్కువ, అలా అయినా కలెక్ట్ చేసేది చాలా తక్కువ. కానీ బాహుబలి మాత్రం వాటన్నిటికీ విరుద్దంగా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడమే కాకుండా నాలుగు వారాలుగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. హిందీ వెర్షన్ లో టాప్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ ఈ సినిమాని రిలీజ్ చెయ్యడం కూడా పెద్ద హెల్ప్ అయ్యింది.