లారెన్స్ కు దయ్యాల సినిమాల బాగా కలిసొచ్చినట్టున్నాయి. కాంచన్ 2 (గంగ) సినిమా తరువాత సూపర్ స్టార్లతో ఓ సినిమా చేస్తానని చెప్పుకున్నాడు ఆ మధ్య కానీ... మళ్ళీ తనకు కలిసొచ్చిన కథతోనే మరో సినిమా మొదలు పెట్టేశాడు. ఈసారి కూడా హర్రర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడించడమనే ప్రయోగంతో మళ్ళీ మొదలు పెట్టేశాడు. వేసవి కానుకగా వచ్చిన ‘కాంచన 2′ తమిళనాట ప్రభంజనమే సృష్టించింది. ఇక ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రాఘవ లారెన్స్ రెండు వరుస సినిమాలకు కమిటయ్యారు. వెందార్ మూవీస్ సంస్థతో కలిసి రాఘవ లారెన్స్ రెండు సినిమాలకు సైన్ చేశారు. ‘మొట్టశివ కెట్ట శివ’ టైటిల్ తో చేస్తున్న ఓ సినిమా నేటి ఉదయం (ఆగస్టు 3) మొదలు పెట్టారు. ఇక ‘కాంచన 3′ పేరుతో మరో సినిమా కూడా ఇదే క్రమంలో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాల్లో తమిళ టాప్ హీరో నటించనున్నారని సమాచారం. ఇక ‘కాంచన 2’లో పాపులర్ అయిన ‘మొండి శివ గుండు శివ’ (తమిళంలో మొట్టశివ కెట్ట శివ) అన్న డైలాగ్ లారెన్స్ తన కొత్త సినిమాకు పెట్టుకోవడం విశేషం.