బాహువులు కోల్పోయిన కథా బలి

July 18, 2015 | 12:23 PM | 5 Views
ప్రింట్ కామెంట్
Rajamouli_bahubali_story_niharonline

స్టోరీ ఈజ్ మై హీరో అనే దాసరి గానీ, గురువు కోవెలమూడి బియేగానీ కథలల్లడంలో దిట్టలయిన సలీం జావేద్ లు గానీ, పరుచూరి అన్నదమ్ములు గానీ, సినిమా చూసి ఇంటికొచ్చిన తదుపరి మనవడుగానీ మనవరాలుగానీ ఆ సినిమా కథ చెప్పవా తాతా అని మారం చేస్తే తడుముకోకుండా రెట్టించిన ఉత్సాహంతో లొట్టలేసుకుంటూ చెప్పనారంభిస్తారు. ఇదీ ఒక వార్తేనంటారా? జర్నలిజం పాఠాల తొలిదశలో వార్త అనగా కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు భాయీ మనిషే కుక్కని కరిస్తే... అదీ వార్త భాయీ సాబ్ అని బోధపరుస్తారు. అమెరికన్ బాక్సాఫీసు టాప్ టెన్ లో ప్రప్రథమంగా మన తెలుగు సినిమాకు చోటు దక్కించిన ధర్శకుడికి శతధా, సహస్రధా అభినందన మందార మాల. టేకింగులో హాలీవుడ్కి ధీటుగా కాదు... కాదు మించిపోయిందనేది నిజం. సరే... సదరు ఉద్దండ పెండాల్ని ఈ సినిమా చూసి వచ్చిన దరిమిలా పసికూనలు కథ చెప్పమని పట్టి పీడిస్తే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అని దీర్ఘాలోచన చేస్తున్నట్టు భోగట్టా. ఒక గ్రామీణ భారత ప్రేక్షకుడు దీన్ని చూడటం తటస్థిస్తే ఒక హాలీవుడ్ ఫిలిం చూసిన తరహాలో ‘ఏం దీసేడ్రా, కోడూరి శ్రీశైల శ్రీరాజమవుళి’ అని సంబరపడిపోతాడు. నరమానవుడికెవరికైనా ఇది ఖచ్చితంగా విజువల్ ఫీస్టు.. కళ్లు చెదిరిపోయే విందు భోజనం... అది ఆరగించుకోవడం అరిగించుకోవడం వేరే సంగతి. ఇది చూసిన ఆ విలేజ్ బాయ్ కి కథ, కథాగమనం, సంభాషణలు పట్టవు. ఎంచేతనంటే ఒక ఇంగ్లీషు సినిమా చూసిన తరహాలో చూడమనడం జరిగింది కదా...అందుకన్నమాట!

సూక్ష్మ్ర గ్రాహులు, రంధ్రాన్వేషకులు గుర్తుంచుకునే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయి. గుడంబా దుకాణంలోకి వస్తూనే అరమోడ్పుకనులతో మత్తు మత్తుగా ‘మత్తు’కావాలి అని కథానాయకుడు దబాయిస్తున్నపుడు మందు సీసాని వడ్డించిన పెద్ద మనిషెవరో గుర్తించండి... యుద్ధరంగంలో వినోదం చూసే బ్యాచ్ లో మీరెవరూ ఊహించని పెద్దాయన పచ్చటి మేని ఛాయతో, పాలనురుగులాంటి గడ్డంతో తళుక్కుమంటాడు. మీరు తెలుగు యూనివర్శిటీకి వెళ్ళినచో ఒక శుభముహూర్తంలో గోచరించగలరు. శివగామి, కట్టప్ప అదేదో మాట్లాడుతూ, నాలికతో చిత్రమైన శబ్ధం చేస్తున్న ఆదిమానవుడూ ప్రేక్షకులకు గుర్తుండగలరు. రాజమవుళీ ఏం  తీసేవయ్యా... రెడీమేడ్ కథ భారతానికి నీ సాంకేతిక పరిజ్నానం, క్రియేటివిటీ తోడయితే అదిరిపోతుందిగా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ