మళయాళంలో బాహుబలికి అవాంతరం

July 11, 2015 | 02:53 PM | 4 Views
ప్రింట్ కామెంట్
baahubali_posters_niharonline1(1)

బాహుబలి ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే...  కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా అనుకున్నట్టుగా రిలీజ్ కాలేదు.  దీంతో మళయాళ సినిమా అభిమానులను ఈ సినిమా ఇతర రాష్ట్రాల్లో లాగా చేరుకోలేకపోయింది. కారణం గత రెండు రోజులుగా మలయాళ చిత్ర సీమ పైరసీ కి వ్యతిరేకంగా థియేటర్ ల బంద్ కొనసాగిస్తోందట. ఈ బంద్ వల్ల  దాదాపు 400 వందల థియేటర్ లు మూతబడ్డాయట. నిజంగానే పైరసీ కోసం సినిమా ధియేటర్స్‌ను మూసేశారా లేక బాహుబలి సినిమాకు దెబ్బేయడం కోసం షట్‌ డౌన్‌ చేశారో తెలియదు కాని.. కేరళలో నిన్న చాలా ధియేటర్స్‌లో మూసేసి 150 స్క్రీన్‌లో రిలీజ్‌ అవ్వాల్సిన బాహబలిని ఓ 60-80 స్క్రీన్స్‌కు కుదించేశారు. సాయంత్రానికి టాక్‌ బయటకు రాగానే సినిమాను 100 స్క్రీన్లకు పెంచారు. ఈరోజు మార్నింగ్‌ చూస్తే 138 ధియేటర్లు సినిమాను ఆడిస్తున్నాయి. పైరసీని ఎవాయిడ్‌ చేయండీ అంటూ ధియేటర్లు స్ట్రయిక్‌ చేయడమేంటో, ఒక్కరోజులో స్ట్రయిక్‌ను కొట్టేయడమేంటో.. ఇప్పుడు బాహుబలిని ఎక్కువ ధియేటర్స్‌లో రిలీజ్‌ చేయడమేంటో అని ఇదంతా ఓ కథలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ