రాజమౌళి బాహుబలి సినిమా ఈ సంవత్సరం విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సంతోషంలో ఉన్న ఇండియాన్ ప్రేక్షకులకు ఈ సినిమా సస్పెన్స్ ఓకింత నిరాశకు గురి చేసింది. టీవీ సీరియల్స్ ముగింపు కోసం ఎదురు చూసినట్టు బాహుబలి 2 కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది.
అయితే ఈ సినిమా డిసెంబర్ లో మొదలు పెడుతున్నారని తెలిసి సినీ అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఇటీవలే ఈ టీం అంతా కూర్చొని బాహుబలి పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ ని ఫైనల్ చేశారని తెలిసింది. అది అయిపోగానే రాజమౌళి తన టీంతో కలిసి సెట్ వర్క్ కి సంబందించిన వర్క్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం టీం అంతా మళ్ళీ ఫాంలోకి వచ్చి బాహుబలి 2 కోసం సెట్స్ ని నిర్మించే పనిలో ఉన్నారు. బాహుబలి రెండవ పార్ట్ ఫస్ట్ పార్ట్ కన్నా బెటర్ గా ఉండాలని వార్ ఎపిసోడ్ ని మళ్ళీ రీ డిజైన్ చేసారు. తాజాగా రాజమౌళి బాహుబలి 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి మొదలు పెట్టనున్నామని అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం బాహుబలి పార్ట్ కోసం ప్రభాస్ వర్క్ అవుట్స్ చేస్తూ బాడీని పెంచే పనిలో బిజీగా ఉంటే అనుష్క ఈ సినిమా కోసం సన్నబడే పనిలో ఉంది.