సస్పెన్స్ తో కథ వదిలేస్తే జనాలు ఊరుకుంటారా? ఇలా జరుగుతుండవచ్చు... కథ అలా మలుపు తిప్పవచ్చు... అంటూ ఎవరికి తోచింది వారు ఊహించేస్తుంటారు. అందుకే బాహుబలి 2 కథలు ఇప్పుడు బాగానే హల్ చల్ చేస్తున్నాయి. కొందరేమో.. బాహుబలి రాజుగా ప్రమాణ స్వీకారం చేశాక బల్లాలదేవుడు కాలకేయ తమ్ముడితో కలసి మాహిష్మతిపై ఎటాక్ చేయిస్తాడని.. అప్పుడు పొరుగు దేశంలో ఉన్న రెబెల్స్ సహాయంతో యుద్దం చేసి.. ఆ రెబెల్ యువరాణి దేవసేనను బాహుబలి ప్రేమిస్తుంటాడని.. ఆమెపై కోరికను పెంచుకున్న బల్లాలదేవుడు బాహుబలికి మళ్ళీ స్కెచ్ వేసి, అలగా జనంతో తిరుగుతున్నాడనే నెపంతో రాజ్యబహిష్కరణ చేయిస్తాడని.. ఆ తరువాత ఓ యుద్దంలో తెలివిగా కట్టప్పతోనే బాహుబలిని చంపిస్తాడని.. ఇలా చంపేయడానికి తల్లి శివగామి కూడా సాయం చేసి తరువాత తప్పు తెలుసుకొని.. దేవసేనను బంధించినప్పుడు ఆమె బిడ్డను తీసుకొని క్రిందకు వచ్చేస్తుందని చెప్పుకుంటున్నారు.... ఆ కథ అలా ఊహిస్తే....
ఇలాంటి కథలు ఇప్పుడు అనేకం వినిపిస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు ఏదో ఒక కథను తయారు చేసుకుంటున్నారు. తోచిన కథను సోషల్ నెట్వర్క్లో చెక్కేస్తూ తమ మేథస్సుకు ఇతరులతో మార్కులు వేయించుకుంటున్నారు. ఇలాంటి కథ నిజమైందనుకోండి.. ఏదో శాటిస్ ఫాక్షన్ తాము కూడా బాగానే కథలు అల్లగలమని. బహుశా రాజమౌళి రేంజులో ఆలోచించేశాం అని మనమే స్నేహితులతో ఒక ట్రీట్ ఇచ్చుకోవచ్చు. అదండీ సంగతి... సెకండ్ పార్ట్ వచ్చే వరకూ ఇలాంటి కథలు ఎన్ని పుట్టుకొస్తాయో మరి...