‘బాహుబలి’ గాలి ‘భజరంగి భాయిజాన్’ వైపుకు

July 14, 2015 | 05:24 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bajrangi_bhaijaan_niharonline

బాలీవుడ్ లో బాహుబలి సందడి తగ్గుముఖం పడుతోంది. నెమ్మదిగా బాహుబలి చర్చలు తగ్గి భజరంగి భాయిజాన్ మీదికి మళ్లుతోంది. ఈ కండల వీరుడికి దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా.. డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? సినిమా ఎలా ఉండబోతోంది అనేది పట్టించుకోకుండా సల్మాన్ సినిమా వచ్చిందంటే చాలు బాలీవుడ్ బాక్సాఫీస్ షేకైపోవడం మామూలే. అందులో సల్మాన్ ఖాన్ కు కోర్టు చిక్కలు రావడంతో అభిమానులకు ఆయన మీద మరింత కన్సన్ పెరిగిపోయింది. అయితే బాహుబలి,  భజరంగి భాయిజాన్ కథలు రెండూ విజయేంద్ర ప్రసాద్ వి కావడం చాలా మందికి తెలియని విషయం. ఈ సినిమాను నిర్మిస్తోంది రాక్లైన్ వెంకటేష్. పాకిస్థాన్ నుంచి తప్పిపోయి వచ్చిన ఓ చిన్నారిని తన సొంత ప్రదేశానికి తీసుకెళ్లడానికి కథానాయకుడు చేసే ప్రయత్నం మీద ఈ కథ సాగుతుంది. ఈ సినిమా పోస్టర్లు కానీ.. ట్రైలర్ కానీ చూస్తుంటే 80ల్లో సూపర్ హిట్టయిన మెగాస్టార్ సినిమా ‘పసివాడి ప్రాణం’ గుర్తొకొస్తోందంటున్నారు జనాలు. ఆ సినిమా కథ కూడా ఆపదలో ఉన్న ఓ పిల్లాడిని హీరో కాపాడటం నేపథ్యంలోనే సాగుతుంది. భజరంగి భాయిజాన్ కథ రాసింది కూడా మనవాడే కాబట్టి.. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే ఈ కాలానికి తగ్గట్లు మోడర్నైజ్ చేసి ఉంటారనడంలో సందేహం లేదు. ఇంతకుముందు సల్మాన్తో ఏక్థా టైగర్ తీసిన కబీర్ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే శుక్రవారం అంటే 17న విడుదలకాబోతోంది. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ