గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని విధంగా ‘బాహుబలి’సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఇదంతా రాజమౌళి దర్శకత్వానికే దక్కుతుందన్న భావన అందరు సినీ ప్రముఖులూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్న మాట. ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులోనూ ఈ మూవీ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టింది. ఇక ఇండియా వ్యాప్తంగా, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ అత్యంత భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వివరాలను చూస్తే... తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాల్లో దాదాపు 24కోట్ల రూపాయాల షేర్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినీ పరిశ్రమలోనూ, అలాగే మరే ఇతర సినిమా సైతం ఇప్పటిలో ఈ రికార్డ్ ని బ్రేక్ చేయటానికి బాహుబలి దరిదాపుల్లోకి రాలేదు. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, రాజమౌళి విజన్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్క అమెరికాలోనే ఈ మూవీ దాదాపు 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్షన్లు కలుపుకొని బాహుబలి సినిమా మొదటిరోజు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి వండర్ అనిపించుకుంది. ఇందులో ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 24 కోట్ల రూపాయాలు రావడం విశేషం.