ఈజిప్షియన్ నటుడు ఒమర్ షరీఫ్ ఒక లేడా? ఒక తరం ప్రేక్షకులు బెంగపెట్టుకుని దిగులు పడేంతగా అందరి అభిమానాన్ని చూరగొన్న ప్రతిభాశాలి. విలక్షమైన నటన, వాచికంతో ప్రపంచవ్యాప్తంగా ఎందరో మన:ఫలకాలపై చెరగని ముద్రవేశాడీ షరీఫ్. నటనా రంగంలోనే గాకుండా వరల్డ్ క్లాస్ బ్రిడ్జి ప్లేయర్ గా రాణించి ఆ ఆటపై పుస్తకాలు పస్తకాలు రచించేడు. తొలిదశలో 23 అరబిక్ భాషా చిత్రాల్లో నటించేడు. స్మోకింగ్ ఎంతగా ఇష్టపడేవాడంటే రోజుకి ‘మినిమం వంద సిగరెట్లను’ ఊదిపారేసేవాడు.
అభిమానులు ఎందుకు పడిచస్తారంటే, తన సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మెకన్నాస్ గోల్డ్ లో కొలరాడో పాత్ర భాష రాని వాడిక్కూడా వెర్రెక్కిస్తుంది. పైగా పక్కనే నటిస్తున్న గ్రెగరీ పెక్ ఉండగా, డాక్టర్ జవాగో, లారెన్స్ ఆఫ్ అరేబియా, ఛెంగిజ్ ఖాన్, నైట్ ఆప్ ది జనరల్స్, లారెన్స్ ఆఫ్ అరేబియా లాంటి కళాఖండం మీద జోక్ చేస్తూ... అది గొప్ప సినిమానే కాని నేను గొప్పగా నటించేనా అన్నది సందేహం. మూడు గంటలకు పైగా ఎడారి సీన్లు, పైగా సొగసుకత్తెలెవరూ లేకుండా అనే వాడు షరీఫ్. సెక్స్ గురించి మొహమాటం లేకుండా చెప్పేవాడు. లవ్ మేకింగ్ అనేది వనితాలోకంతో మనకున్న బెస్ట్ కమ్యూనికేషన్, పట్టుపరుపు మనకు లభించిన హోలీ టేబుల్ దానిపైనే అనురాగం, పవిత్రత దొరుకుతాయి. ఇదీ షరీఫ్ దృక్ఫథం.
ఇటువంటి ఆర్టిస్టు మనకు దొరకడం పూర్వజన్మ పుణ్యం. ఒమర్ షరీఫ్ లేని ప్రేక్షక లోకం ఏం కోల్పోయిందో తెలియాలంటే ఈ షరీఫ్ బాయ్ సినిమాలు చూడటమే!