ఇప్పుడంతా ఎక్కడ చూసినా బాహుబలి చర్చలే... ఓ అభిమాని అందుకే కాబోలు ప్రభుత్వాన్ని జులై 10 సెలవు ప్రకటించాలని కోరారు. మరి అంతే కదా... కాలేజీలకు వెళ్ళకుండా టికెట్ల కోసం స్టూడెంట్సూ, పనులు మానుకుని ఉద్యోగస్తులు ఈ సినిమా చూడాలని తాపత్రయ పడుతున్నారు. ఇంతలా చర్చ జరిగే ఈ సినిమాకు ఓ రోజు సెలవిస్తే తప్పేంటి...? సరే... ఆ అభిమాని కోరికైతే తీరలేదు గానీ... సీంఎం గారూ బాహుబలి చూసేస్తున్నారట. తాజాగా బాహుబలి సినిమా మేనియా పొలిటీషియన్స్ ను కూడా పాకింది. ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించేలా ఈ సినిమా తీయడమే ఇందుకు కారణం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ‘బాహుబలి' సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన కోసం జులై 11న రాత్రి ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ షోకు కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. చూద్దాం పొలిటికల్ లీడర్లు ఏమంటారో ఈ సినిమా చూసి...