బాహుబలి చిక్కు విప్పిన కట్టప్ప కొడుకు?

August 08, 2015 | 04:39 PM | 4 Views
ప్రింట్ కామెంట్
Sathyaraj_Bahubali_sibiraj_niharonline

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఇదే ప్రశ్న అందరిలో?  ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి మొదటి పార్ట్ ఓ చిక్కుముడితో ముగించారు. ప్రేక్షకులకు బాహుబలి పార్ట్ 2 వచ్చే వరకూ ఇది మెదడుకు మేతలా తయారైంది. ఇప్పుడు ఈ ట్విస్ట్ నెటిజన్ల కు మంచి చర్చగా మారింది. దీనిపై పంచ్ లు జోకులు సోషల్ నెట్వర్క్ ల్లో బాగా పేలుతున్నాయి. నవ్వుతెప్పించే పిక్చర్లు, కామెంట్లు ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ ట్విస్ట్ కు సత్యరాజ్ (కట్టప్ప) కొడుకు శిబిరాజ్ నవ్వు తెప్పించే చక్కని ఆన్సర్ ఇచ్చాడు.  అదేమిటంటే ‘‘రాజమౌళి నాకు బాహుబలి చిత్రంలో ఓ పాత్ర ఇవ్వనందుకు అప్పకు చాలా కోపం వచ్చింది అందుకే అతన్ని చంపేశాడు’’ అన్నాడు. నిజమే కావచ్చు. కనీసం ఇప్పుడైనా ప్రభాస్ రోల్ శిబిరాజ్ కు ఇవ్వచ్చు కదా...!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ