బాహుబలి సినిమాకు తెలుగు లో ఇతర సినిమాలు అడ్డు తగలకుండా మేనేజ్ చేసుకుంటూ వాస్తున్నారు ఆ సినిమా టీమ్. కానీ ఇతర భాషల వాళ్ళు మన తెలుగు వాళ్ళను ఎందుకు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు ‘‘బాహుబలి''కి బాంబే, తమిళనాడుల్లో ఈ ఇబ్బంది తప్పేలా లేదు. హిందీలో బాహుబలి వచ్చిన వారానికి సల్మాన్ ఖాన్ ‘‘బజరంగీ భాయ్‌జాన్'' పోటీకి వస్తున్నాడు. ఇక తమిళంలో ధనుష్ ‘‘మారీ'' సినిమా అడ్డు తగిలేలా ఉంది. ఇది చాలదన్నట్టు శింబు కూడా ‘‘వాలూ'' తో వాలిపోదామని చూస్తున్నాడు. మనోళ్లు జూలై 10న ఎంటరవుతుంటే, వీళ్ళంతా 17కు దిగిపోతున్నారు. అంటే ఇక్కడి కలెక్షన్లు వారం మాత్రమే అన్నమాట.... చూద్దాం ఆ సినిమాలతో సంబంధం లేకుండా బాహుబలిని చూస్తారేమో...