ఇటీవలే ఓ పెళ్ళి వేడుకకు వెళ్ళి తాను తాతను కాబోతున్నానని బాలకృష్ణ వెల్లడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అటు నారావారింట్లో, ఇటు నందమూరి వారింట్లో ఈ ఉగాదిని మరింత ఆనందమయం చేస్తూ వారింటికి వారసుడు వచ్చేశాడు. నాయుడుగారి తనయుడైన లోకేష్-బ్రాహ్మణి దంపతులకు మగశిశువు జన్మించాడు. మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రాహ్మిణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ ఇరువురి తాతలు ఇప్పుడు ఇటు సినిమా అభిమానులతో, అటు తెలుగు తమ్ముళ్ళతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.