బాలయ్య స్టెప్పులు అదుర్స్

November 21, 2014 | 05:25 PM | 32 Views
ప్రింట్ కామెంట్

ఇప్పుడున్న సీనియర్ హీరోలలో డాన్స్లలో తోపు ఎవరంటే బాలకృష్ణ అని టక్కున చెబుతారు. ఎందుకంటే నందమూరి స్టెప్పులంటే దబ్బిడి దిబ్బిడి... ఫ్యాన్స్ కి పండగే కదా. ఇక ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీలో కూడా బాలయ్య స్టెప్పులు ఇరగదీయబోతున్నాడట. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవా అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ బాణీలు అందిస్తున్న ఈ చిత్రంలో ఓ రెండు పాటల్లో బాలయ్య డాన్సులు కేకపుట్టించే విధంగా ఉంటాయట. పైగా వీటికి లారెన్స్ కొరియోగ్రఫీ చేకూర్చుటుండటంతో హైప్ ఇంకాస్త పెరిగింది. మరి బాలయ్యతో లారెన్స్ ఏ రేంజ్ లో స్టెప్పులు వేయిస్తాడో తెలియాలంటే సినిమా వచ్చేదాక ఆగాల్సిందే. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్ . బాలయ్య బాబు స్టెప్పులా... మజాకా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ