అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ -2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "భలే భలే మగాడివోయ్' . మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తుంది. కొత్త జంట ఫ్లాఫ్ అవ్వటంతో మారుతి కూడా తనకు అచ్చోచ్చిన ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త జోనర్ లో ఈ చిత్రం తెరెక్కినట్లు సమాచారం. ఇందులో హీరో నాని అల్జీమర్(మతిమరుపు) పేషెంట్ లా నటించబోతున్నాడట. ఇక మరోవైపు గోపీసుందర్ అందించిన ఆడియో కి మంచి రెస్పాన్స్ రావటంతో యూనిట్ సబ్యులందరూ ఆనందంగా వున్నారు.
అయితే గుణశేఖర్ రుద్రమదేవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ త్యాగం చేసి వాటి వాటి విడుదలను వాయిదా వేసుకున్నాయి. అందులో ఇది కూడా ఉంది. కానీ ఇప్పుడు రుద్రమ వాయిదా పడటంతో వరుస పెట్టి చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. నాని చిత్రాలకు మంచి క్రేజ్ ఉండటంతో ఆ తేదీనే వాడుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. డాల్బి అట్మాస్ లో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్లు నిర్మాత ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తానికి భారీ ప్రాజెక్టు పోస్ట్ పోన్ కావటం నాని సినిమాకి భలే కుదిరిందన్న మాట.