నేచురల్ స్టార్ నాని... ఇండస్ట్రీలో ఒకానోకదశలో పెద్ద హీరోల తాకిడికి మాయమయిపోతాడు అని అంతా అనుకున్నారు. కానీ, ట్యాలెంట్ ముందు విధి ఓడిపోయింది. అందుకే మూడు వరుస హిట్లతో సక్సెస్ ట్రాక్ లోకి ఎంటర్ అయిపోయాడు. అయితే చిన్న బడ్జెట్ నిర్మాతలకు నాని ఇప్పుడు కల్పవృక్షంగా మారిపోతాడు అనుకున్నప్పటికీ అది మాత్రం జరగట్లేదు. గత చిత్రాలు గీతా ఆర్ట్స్, 24 ఫ్రేమ్స్ ఇలా రెండు పెద్ద సంస్థలే చేసినవే. ఇక ఇప్పుడు మరో బడా ప్రొడ్యూసర్ నాని కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పటి కమెడియన్, ఇప్పటీ స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా నానితో ఓ చిత్రం చేయాలన్న ఆలోచనలో ఉన్నాడంట. ఇందుకోసం మళయాళం బ్లాక్ బస్టర్ టూ కంట్రీస్ రీమేక్ హక్కులను కొనుగొలు చేశాడంట. భార్యను దారిలోకి తెచ్చుకోవడానికి ఒక భర్త పడే కష్టాల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. మాతృకలో దిలీప్, మమతా మోహన్ దాస్ లీడ్ రోల్ చేశారు. మంచి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగులో చేయాలని, అది కూడా నానితోనేనని ఫిక్సయ్యాడంట. అంతేకాదు దర్శకుడిగా హరీష్ శంకర్ ను కూడా అనుకుని అప్రోచ్ అయ్యాడంట. అయితే హరీష్ ఇటీవలే బన్నీకి ఒక కథ చెప్పి వెయిటింగ్ లిస్టులో ఉన్నాడు. దీంతో 'టూ కంట్రీస్' రీమేక్ కాస్త లేట్ కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.