ఒక్క అమ్మాయి కోసం తమన్ చేసిన ఫీట్

March 09, 2016 | 04:43 PM | 4 Views
ప్రింట్ కామెంట్
thaman-micky-j-mayer-niharonline

ఫ్రెండ్లీ రిలేషన్ అనేది తెలుగు సినిమాల్లో కామన్. ఒకరి సినిమాలో ఒకరు గెస్ట్ రోల్స్ చేయటం, గొంతులు అరువు ఇవ్వటం ఇలా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ చేసేదే. అయితే ఒక సంగీత దర్శకుడి కోసం మరోక సంగీత దర్శకుడు గొంతు ఇవ్వటం అనేది చాలా అరుదు. గతంలో ఇళయరాజా, ఆర్పీ పట్నాయక్, చక్రి, వంటి సంగీత దర్శకులు తమ మధ్య పోటీ మరిచి ఒకరు ఇంకోకరి చిత్రాల్లో పాటలు పాడారు. ఇక ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయాడు దబ్బిడి దిబ్బిడి తమన్. మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చుతోన్న సినిమాలో ఆయన ఈ పాట పాడటం విశేషం.

                    మిక్కీతో ఆయనకి గల స్నేహమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సందీప్ కిషన్ - నిత్యామీనన్ కాంబినేషన్లో 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిక్కీ జె.మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ 'తమన్' పాడితే బాగుంటుందని భావించి, ఆయనని మిక్కీ సంప్రదించాడట. స్నేహితుడి రిక్వెస్ట్ మేరకు తమన్ ఆ పాటను పాడాడని అంటున్నారు. త్వరలోనే ఆ పాటతోపాటు టీజర్ ను కూడా వదిలేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ