అదిరిపోయే ఆరంగ్రేటం ‘అల్లుడు శీను’ చిత్రంతో పేరు తెచ్చుకున్న యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి సౌత్ బేబీ డాల్ సమంతతో జతకట్టనున్నట్లు సమాచారం. త్వరలో సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రీనివాస్ హీరోగా నటించనున్నాడు. తమిళంలో రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్టయిన సుందరపాండియన్ చిత్రానికిది రీమేక్. ముందుగా దీనికోసం ముగ్గురు హీరోలను అనుకున్నప్పటికీ వర్కవుట్ కాకపోవటంతో ఆఖరికి శ్రీను దగ్గరికి కథ వచ్చి చేరిందట. ఇక ఈ చిత్రానికి సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం శ్రీను, బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఇందులో తమన్నా కథానాయిక. భారీగా పారితోషకం ముట్టజేప్పటంతో అల్లుడు శీను చిత్రానికి కమిట్ అయిన సమంతా మరిప్పుడు మళ్లీ ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందో చూడాలి.