సాధారణంగానే ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా చాలా మంది కొత్తవారు తెలుగు చలనచిత్ర సీమకు పరిచమయ్యారు. సాయిధరమ్, వరుణ్ తేజ్ లాంటి మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరోలతోపాటు చిన్నాచితకా వాళ్లు కూడా చాలా మందే తెలుగు ప్రజలను పలకరించారు. వీళ్లంతా ఒకెత్తయితే ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన గ్రౌండ్ వర్క్ తో పైకోచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు. ఫేస్ వాల్యూ లేనోడు వీడికంతా సీనుందా అనుకున్న వారికి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ప్రమోట్ చేసుకోని సెన్సెషన్ అయ్యి తన స్టామినా ఏంటో రుచి చూపించాడు. అంతేకాదు తన ‘హృదయకాలేయం’ ద్వారా జనాల్ని థియేటర్ల వరకు రప్పించి దానిని చిన్న చిత్రాలలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిపాడు. తొలి రోజు చాలా చోట్ల హౌస్‌ఫుల్స్ పడే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుని ఈ బర్నింగ్ స్టార్ టాలీవుడ్‌కు షాకిచ్చాడు. తెరమీద అతగాడి స్టైయిల్, పంచ్ డైలాగులు, విన్యాసాలు చూసి ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేశారు. సంపూ సందడి ఆ చిత్రంతోనే ఆగలేదు. ఈ వెంటనే రెండూ, మూడు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ప్రస్తుతం వాటిలో బిజీగా ఉన్నాడు. సంపూ రేంజ్ ఎంతదాకా వెళ్లిందంటే సెన్సెషనల్ డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్వయంగా అతగాడితో సినిమా తీసేందుకు ముందుకు వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఇతగాడికి మంచు వారు అందిస్తున్న ప్రోత్సాహం కూడా అభినందనీయం. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన కరెంట్ తీగ సినిమాలో సన్నీలియోన్ బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి మనోడిని సెలక్ట్ చేయడం, అతడు స్క్రీన్ మీద కనిపించినప్పుడు థియేటర్లలో గోల చూస్తే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎన్ని హిట్లున్న, ఏ స్టార్ హీరో తన క్రేజ్ చూపించినా సంపూ మాత్రం సమ్ థింగ్ స్పెషలే...