ఈ ముఖం అందరికీ బాగా పరిచయమే... చాలా సినిమాల్లో విలన్ గానే నటించాడు. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా కనిపించాడు. అయితే ఈయన సినిమాల్లో నటించిన తొలినాళ్ళలో ఓ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటూ అందరికీ తన అనుభవాన్ని వివరించాడు. ఈయన అతిలోక సుందరి శ్రీదేవి తో రేప్ సీన్ లో నటించాడట. ఆయన ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంగతులను పంచుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన వేణు బెనర్జీ అనుకోకుండా యాక్టరయ్యాడు. రామ్ గోపాల్ వర్మ తీసిన చాలా సినిమాల్లో బెనర్జీ అందరికీ కనిపిస్తూ ఉంటాడు. ‘గాయం’, ‘గులాబి’, ‘నువ్వు నేను’, ‘సత్య’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘చిత్రం’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ ఇలా దాదాపు మూడు వందల చిత్రాల్లో నటించిన బెనర్జీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’ ఆధారంగా శ్రీదేవి, అమితాబ్ లు జంటగా నటించిన ‘ఇంక్విలాబ్’ అనే సినిమాలో ఎం.పి. కొడుకు శ్రీదేవిని ‘రేప్’ చేయబోయే సన్నివేశం ఉందట. నిజానికి ఆ పాత్రకు కన్నడంలో నటించిన నటుడినే బుక్ చేశారట. అయితే అనుకోని కారణాల వల్ల ఆ నటుడు షూటింగ్ కు రాకపోయేసరికి ఆ సినిమా దర్శకుడు బెనర్జీని ఆ సన్నివేశంలో నటించమని చెప్పాడట. అయితే అప్పటికే శ్రీదేవి వెండితెరపై దేదీప్యమానంగా వెలుగుతున్న తార అవడంతో ఆమెతో రేప్ సీన్లో పాల్గొనమనగానే చెమటలు పట్టేశాయట బెనర్జీకి. అయితే భయంభయంగా నటిస్తున్న బెనర్జీ బాధను కనిపెట్టిన శ్రీదేవి ‘‘పర్వాలేదు బెనర్జీ సహజంగా నటించు నేనేమీ ఫీలవను’’ అంటూ చెప్పిన తర్వాత ఆ రేప్ సీన్ లో నటించి మెప్పించాను అని అంటున్నాడు బెనర్జీ. కాని శ్రీదేవితో ఆ రేప్ సీన్ లో నటిస్తున్నప్పుడు జరిగిన పెనుగులాటలో తనకెంతో ఇష్టమైన తన చేతి గోల్డ్ చైన్ ముక్కలు కావడం తనకు ఇంకా గుర్తు ఉంది అని అంటున్నాడు బెనర్జీ.