భాయిజాన్ పవన్ తో తెలుగులో?

August 04, 2015 | 04:07 PM | 5 Views
ప్రింట్ కామెంట్
pawan_kalyan_bhajarangi_remake_niharonline

సల్మాన్‌ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’ను తెలుగులో రీమేక్ చేసే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ సినిమా అంతకు ముందు పీకే రికార్డును బద్దలు కొట్టే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికి 500 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్ రాబట్టిన భైజాన్ కు కథ అందించింది మన తెలుగు రైటర్ విజయేంద్రప్రసాద్ అన్న సంగతి తెల్సిందే! ముందుగా ఈ స్టోరీని తెలుగులో చేయాలని అనుకున్నా భారత్ - పాకిస్తాన్ బోర్డర్‌కు చెందిన సబ్జెక్ట్ కావడంతో ఇది బాలీవుడ్‌కు వర్కౌట్ అయ్యింది. మరి ఇప్పుడు దీన్ని తెలుగులో ఎలా తీస్తారన్నదే ప్రశ్నార్థకం అవుతోంది.  అయినా వినిపిస్తున్న సమాచారం ప్రకారం భజరంగీని తెలుగులో చేయడానికి పవన్‌ను ఒప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు సల్మాన్ ‘దబాంగ్‌’ని గబ్బర్‌సింగ్ గా రీమేక్ చేసి సక్సెస్ సాధించడంతో సల్మాన్ సెంటిమెంట్‌తో భాయ్‌జాన్‌ను కూడా పవన్ తో చేయడానికి దిల్‌రాజు - రాక్‌లైన్ వెంకటేష్ ట్రై చేస్తున్నట్టు సమాచారం. దర్శకుడిగా గబ్బర్‌సింగ్ ఫేం హరీష్‌శంకర్ నే ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. సర్దార్ తరువాత పవన్ తో ఈ సినిమా మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ