మొదటి సారిగా ఓ తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాలకు ధీటుగా కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గనప్పటికీ బాలీవుడ్ లో మాత్రం దాని తరువాత విడుదలైన భజరంగి భాయిజాన్ సినిమా ఓ మెట్టు పైకి చేరుకుంది. గ్రాస్ కలెక్షన్ ల పరంపర టాప్ 25 సినిమాలను పరిశీలిస్తే...
టాప్ 1 గ్రాసర్ (లైఫ్ టైమ్)గా అమీర్ ఖాన్ నటించిన పీకే రికార్డుల కెక్కింది. పీకే వసూళ్ళు దాదాపు 730 కోట్లు. ఈ రికార్డులను ఇంకా బాహుబలి అధిగమించాలంటే చాలా టైమ్ పడుతుంది. ఫుల్ రన్ పూర్తయ్యాక కానీ చెప్పలేం. ధూమ్ – 3 తెలుగు తమిళ్ హిందీలో సాధించిన గ్రాస్ 540 కోట్లు. ఆ తర్వాత భజరంగి భాయిజాన్ 14 రోజుల్లో 495 కోట్ల గ్రాస్ తో మూడో స్థానంలో నిలిచింది. 21 రోజుల్లో 468 కోట్ల వసూళ్లతో బాహుబలి నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాలిన పరిశీలిస్తే... 3 ఇడియట్స్ 395 కోట్లు, చెన్నయ్ ఎక్స్ ప్రెస్ 393 కోట్లు, కిక్ 360 కోట్లు, హ్యాపీ న్యూ ఇయర్ 345 కోట్లు, ఏక్ థా టైగర్ 308 కోట్లు, క్రిష్ 3- 307 కోట్లు, యే జవానీ హై దివానీ 298 కోట్లు, రోబో 289 కోట్లు, బ్యాంగ్ బ్యాంగ్ 280 కోట్లు, దబాంగ్ 249 కోట్లు, తను వెడ్స్ మను రిటర్న్స్ 240 కోట్లు, 239 కోట్లు, బాడీ గార్డ్ 233 కోట్లు, సింగం రిటర్న్స్,220 కోట్లు, దబాంగ్ 219 కోట్లు, రావన్ 213 కోట్లు, జబ్ తక్ హై జాన్ 210 కోట్లు, డాన్ 2 – 208 కోట్లు, మై నేమ్ ఈజ్ ఖాన్ 206 కోట్లు, రామ్ లీల 202 కోట్లు, రౌడీ రాథోర్ 198 కోట్లు వసూలు చేశాయి.