ఈ ఏడాది నానికి అదృష్టం బాగా కలిసొచ్చింది. రెండు సినిమాల హిట్ హీరో అయిపోయాడు. ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కూడా హిట్ లిస్టులో చేరిపోయింది. విభిన్న కథా చిత్రాల హీరోగా అందరినీ ఆకట్టుకుంటున్న నానికి ఇప్పుడు విడుదలైన భలే భలే మగాడివోయ్ చిత్రం కూడా ఆయన కెరీర్ లో పెద్ద బ్రేక్ చిత్రంగా నిలిచిపోయింది. అందులో ఈ సినిమాతో నాని సరసన సహజ నటుడు అనే బిరుదు కూడా తగిలించడం విశేషం. ఇది ఏ పెద్ద హీరోకూ దక్కని అరుదైన గౌరవం.
భలే భలే మగాడివోయ్ చిత్రానికి వరల్డ్ వైడ్ కలెక్షన్లను పరిశీలించినట్టయితే మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్ 5.10 కోట్లు రాబట్టింది. విడుదలైన వారం రోజుల కలెక్షన్లు 14 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రం ఓవర్సీస్ లో 700 థియేటర్లలో రిలీజ్ చేశారు. మొత్తం ఈ చిత్రం కోసం నిర్మాతలు ఖర్చుపెట్టింది 12 కోట్లు మాత్రమే. కానీ ఈ చిత్రానికి ఇప్పటి వరకూ రాబట్టింది 23 కోట్లని తెలుస్తోంది. నిర్మాతలు ఖర్చుచేసిన డబ్బును మొదటి వారంలోనే రాబట్టుకోకలగడం విశేషం. ఈ సినిమాకు యూఎస్ లో శుక్రవారానికి వసూలైన కలెక్షన్లు ఒక కోటి రూపాయలకు చేరుకుంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో ఇంత రెస్పాన్స్ రావడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
ఇంతకు ముందు రిలీజైన బాహుబలి ఓవర్సీస్ కలెక్షన్ ఒకవారికి 30 కోట్లు రాబడితే, శ్రీమంతుడు 20 కోట్లు, మూడో స్థానంలో ఉన్న భలే భలే మగాడివోయ్ 14 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇంత చిన్న బడ్జెట్ చిత్రం ఈ స్థాయి కలెక్షన్లను రాబట్టడంపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. మరో విశేషమేమంటే ఈ చిత్రానికి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ పగ్గాలు దర్శకుడు మారుతీ చేతిలోకి వెళ్ళడం!!