భీమవరం ఫ్లెక్సీల ధ్వంసంలో ఇరువురు హీరోల అభిమానులు గొడవ పడడం... ప్రభుత్వ ఆస్థికి నష్టం కలిగించడం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ హీరోలు మాత్రం ఈ గొడవలకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు. నిజానికి ఇలాంటి సమస్యలకు ఎలా స్పందించాలో వారికి అర్థం కాకపోవచ్చు. కానీ తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే పవన్ కళ్యాణ్ జరిగిన నష్టానికి ప్రభుత్వానికి కొంత డబ్బు ముట్ట చెప్పినట్టు తెలుస్తోంది. అభిమానులకు కూడా ఇలాంటి గొడవల్లో తలదూర్చవద్దని చెప్పాడట. ఈ గొడవల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్థులకు నష్టం వాటిల్లినందున పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి 3 లక్షలు నష్టపరిహారంగా పంపించాడట. హీరోలను అభిమానులు ఎంతగా ప్రేమిస్తారో పవన్ కళ్యాణ్ కు తెలుసు కాబట్టి వారిమీద ప్రేమతోనే ఇలా డబ్బు పంపించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాన్ ఈ విధంగా అభిమానులు చేసిన నష్టానికి డబ్బు పంపించడంపై భీమవరం ఎస్.ఐ ఆయనను అభినందించాడు. ‘‘ఇప్పటి వరకూ ఇలాంటి ఎన్నో గొడవలను చూశాం గానీ, ప్రభుత్వ ఆస్థుల నష్టానికి, ఒక నటుడు స్పందించి స్వచ్ఛందంగా డబ్బు పంపించడం మొదటి సారి చూస్తున్నా’’నని అన్నాడు.