లక్కీ భూమిక సెవెంత్ సెంటిమెంట్?

October 21, 2015 | 02:35 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bhumika-hero-seventh-movie-sentiment-niharonline

హీరో... హీరోయిన్లకు ఫీల్డులోకి అడుగు పెట్టింది మొదలు కొందరికి అదృష్టం కలిసొస్తుంది... మరికొందరికి వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చేస్తుంది. ఈ సెంటిమెంట్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టే కనిపిస్తుంది. 
ఇదంతా ఖుషీ, ఒక్కడు, సింహాద్రి సినిమాలు చేసిన హీరోయిన్ భూమిక గురించి. ఈమె మొదటి సినిమా యువకుడు నుంచీ వరుసగా హిట్లు కొడుతూ... లక్కీ  భామగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు అందరూ ఈ విషయాన్ని గమనించి ఉండరు. ఈ మూడు సినిమాల హీరోలు టాలీవుడ్ లో టాప్ హీరోలు. ఈ ముగ్గురికీ కూడా ఇవి 7వ సినిమాలట. పవన్ కళ్యాన్ కు అప్పటికే భద్రి, తమ్ముడు సినిమాలు హిట్లు ఉన్నప్పటికీ, ఖుషీ సినిమాకు వచ్చినంత పేరు రాలేదు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో ఆది బ్లాక్ బస్టర్ సినిమా అయినప్పటికీ సింహాద్రి హీరోయిన్ తో మరింత అదరగొట్టేసింది. ఈ సినిమాతో రాజమౌళి యాక్షనిజాన్ని భీభత్సమైన రీతిలో మనకు పరిచయం చేసి సంచలనాత్మక విజయాన్ని అందుకున్నారు.  ఇక ఒక్కడు సినిమా గురించి చెప్పనవసరం లేదు. ఈ మూడు సినిమాల్లోనూ ఆడిపాడి అందాలు చూపించే హీరోయిన్ కాదు భూమిక ఆమె క్యారెక్టర్ కూ ప్రాముఖ్యత ఉన్న సినిమాలు. కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతున్నట్టుండే సినిమాు. ఈ మూడు హీరోలకు 7వ సినిమా కావడం విశేషం. అయితే తెలుగులో సింహాద్రి, సాంబ తరువాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు టర్న్ అయిపోయింది భూమిక. మిస్సమ్మ, అనసూయ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలకు పేరు వచ్చినా హీరోలతో చేసిన ఆ బ్లాక్ బస్టర్ స్థాయి సినిమాలు ఆమెకు దక్కలేదు. మూడు నాలుగేళ్ళే భూమిక తెలుగు హవా బాగా నడిచింది. తరువాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసింది. అడపాదడపా ఏవో సినిమాలు చేస్తున్నా భూమిక ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు జనాలు ఫీలవుతారు. పెళ్ళి చేసుకుని బిడ్డకు తల్లయిన తరువాత సినిమాలకు మరింత దూరమైంది. అయితే సినిమాల్లో అంతగా ఎక్స్ పోజింగ్ చేయని భూమిక ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్లో చాలా హాట్ గా కనిపించి, మళ్ళీ అవకాశం ఇస్తే సినిమాల్లో చేస్తానని చెప్పింది. ప్రాముఖ్యతను బట్టి వదిన, అక్క పాత్రల్లోనూ నటిస్తానంటోంది. మరి తెలుగులో ఏ దర్శకుడు ఆమెకు అవకాశం ఇస్తాడో చూడాలి.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ