ఒకప్పటిలా 30, 40 ఏళ్ళు తెరమీద హీరోలుగా చలామణి అవుతామంటే ఇప్పుడు కుదురుతుందా? యంగ్ జనరేషన్ అందులో వారసులకు ఛాన్స్ ఇవ్వాలంటే 50 ఏళ్ళు పైబడిన హీరోలు డిగ్నిటీగా తప్పుకోవాలి. నిన్నమొన్నటి వరకూ తెరమీద అదరగొట్టిన హీరోలు కూడా తమకు వయసై పోయింది కదా ఇక ఇలాంటి పాత్రలంటే కష్టం... అంటూ స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇక తమకు హీరో రోల్స్ కష్టమే అనుకున్న కొందరు హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా లేదా పవర్ ఫుల్ విలన్లుగా మారిపోతున్నారు. శ్రీకాంత్ వంటి హీరోలు కాస్త కీలక పాత్రలు ఎంచుకొని వాటితో తృప్తి పడుతున్నారు. మన టాలీవుడ్ లో ముందుగా ఈ విషయాన్ని జగపతి బాబు గమనించి... నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఆయన రూటు మార్చుకున్న తరువాత విలన్ గా చాలా రోల్స్ వచ్చేశాయి. మహేష్ కు తండ్రిగా కూడా నటించాడు. మారుతున్న కాలాన్ని బట్టి మారాలి కదా... వయసు పై బడ్డా తామింకా హీరోలుగానే చేస్తామంటే ఎలా? ఇప్పుడు రాజశేఖర్ చిరంజీవి 150వ సినిమాలో విలన్ రోల్ ఇస్తే తప్పకుండా చేస్తా అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన గెడ్డం గ్యాంగ్ తో చేతులు కాల్చుకున్నాడు పాపం. ఇప్పుడు ఇక తప్పదని తానూ విలన్ రోల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇప్పుడు తేజ ఓ ప్రాజెక్టుకు సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో మెయిన్ రోల్ విలన్ దే. ఆ రోల్ కోసం ఇప్పుడు రాజశేఖర్ ను అడిగితే వెంటనే ఒకే చెప్పాశాడట. తేజ ఒకప్పుడు హీరో గోపీచంద్ ను విలన్ గా రెండు సినిమాల్లో తీసుకుని ఇతను విలన్ కే పనికొస్తాడన్నంత పవర్ ఫుల్ గా చూపించాడు. ఇక రాజశేఖర్ అయితే కెరీర్ ప్రారంభంలో విలన్ గా చేశాడు కూడా. జయం, నిజం సినిమాల్లో గోపీచంద్ ను చూపించినట్టు రాజశేఖర్ ను కూడా చూపిస్తే... టాలీవుడ్ లోకి బాలీవుడ్ నుంచి విలన్లనూ అరువు తెచ్చుకునే ట్రెండ్ మారుతుందేమో...!