'రబ్ నే బనాది జోడీ చిత్రంలో డ్యాన్స్ పే చాన్స్ అంటూ షారూఖ్ ఖాన్, అనుష్కా శర్మలకు పెద్ద హిట్టందించడమే కాకుండా తన సుమధుర గళంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ సింగర్ లాభ్ జాంజ్వా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబైలోని బంగుర్ నగర్ కాలనీలోని తన అపార్టుమెంటులో ఆయన శవమై కనిపించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జాంజ్వా మృతిపట్ల బాలీవుడ్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తన స్నేహితుడి ఆత్మకు శాంతి కలగాలని కంపోజర్ ప్రీతం విచారం వ్యక్తం చేశాడు. పలు భాంగ్రా పాటలను పాడి ప్రజలకు చేరువైన జాంజ్వా మృతి బాలీవుడ్ కు తీరని టుగా మిగిలింది.